KTR:రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?

21
- Advertisement -

రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రంజిత్ రెడ్డి ఎంపీగా, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి మంత్రిగా ప‌ద‌వులు అనుభ‌వించిన వారు త‌ల్లి లాంటి పార్టీకి మోసం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో రంజిత్ రెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉందన్నారు.

93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో 17 ఎంపీ స్థానాల‌కు గానూ 12 స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాల‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయేకు 220 సీట్లు, యూపీఏ 150 సీట్లు దాటే ప‌రిస్థితి లేదు అన్నారు.బీఆర్ఎస్‌కు 12 సీట్లు వస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న మనమే కీలకం అవుతామన్నారు.

Also Read:Modi: హనుమాన్ చాలీసా వినడం నేరమేనా?

- Advertisement -