విద్యార్థుల ప్రాణాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడటం సబబేనా అని ప్రశ్నించారు కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసి కేటీఆర్ .. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా అని ప్రశ్నించారు. పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై… పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే కనీసం సమీక్ష అయినా నిర్వహించావా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
గురుకులాలకు తాళం పడేలా చేశారని, ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెట్టారని దుయ్యబట్టారు. సకల జనులను కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు పెట్టిస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం…
విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..
కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు?
విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS
— KTR (@KTRBRS) November 7, 2024