KTR:అదానీతో చీకటి ఒప్పందాలు బయటపెట్టాలి

8
- Advertisement -

అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీపై యూఎస్‌లో అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని విమర్శించారు.

అదానీతో కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు.

 

Also Read:Gautam Adani: గౌతం అదానీకి షాక్‌.. అరెస్టు వారెంట్

- Advertisement -