KTR: పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు

2
- Advertisement -

కాంగ్రెస్ పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదని దుయ్యబట్టారు.

పల్లె ప్రగతి వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు.. నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన పట్టణాలు, నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని ఫైరయ్యారు. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గరపడిందని మండిపడ్డారు.

Also Read:Harish:రైతుబంధు ఎగనామం,బోనస్ బోగస్

- Advertisement -