KTR:నిరుద్యోగ భృతి ఏది?

23
- Advertisement -

అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అంటే కపట నీతికి మారు పేరని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని, కానీ.. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను కాంగ్రెస్‌ పార్టీ నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్న హామీపై యూ టర్న్ తీసుకుంటూ.. టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2వేలకు (2 పేపర్లకు) పెంచిందన్నారు నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్ అని ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.

- Advertisement -