అక్షరం మార్పు కోసం 1000 కోట్లా?

3
- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం పేరును టీఎస్‌(తెలంగాణ స్టేట్‌)గా మార్చగా ఒక్క అక్ష‌రం మార్పు కోసం అక్ష‌రాల రూ. 1000 కోట్ల ఖ‌ర్చా..? అంటూ ప్రశ్నించారు.

రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు.. ఒక్క అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? అని ప్రశ్నించారు. వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు… కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

 

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో బీఆర్ఎస్వీ నేత నాగేందర్‌ రావు

- Advertisement -