- Advertisement -
ఫార్ములా-ఈ కేసు విషయంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:15 గంటలకు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు విచారణకు రానుంది ఫార్ములా-ఈ కేసు.
లంచ్ మోషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించడంతో.. సీజే బెంచ్ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్‌ఎస్) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్ 409, 120 (బీ) సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు.
Also Read:అవినీతి లేదు అంటూనే అక్రమ కేసా: కౌశిక్ రెడ్డి
- Advertisement -