నగరంలోని పారిశ్రామిక కాలుష్యంపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ, టియస్ ఐఐసి మరియు కాలుష్యనియంత్రణ మండలి అధికారులు పాల్గోన్నారు. వర్షకాలం నేపథ్యంలో పారిశ్రామిక వ్యర్ధాలను నాలాలోకి డంపు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం అక్రమంగా డంపింగ్ జరుగుతున్న చోట్ల సిసి కెమెరాలు పెట్టాలని గతంలో ఇచ్చిన అదేశాలను మంత్రి సమీక్షించారు.
ఈ మేరకు టియస్ ఐఐసి జీడిమెట్ల, బాలనగర్లో ఇప్పటికే 120 సిసి కెమెరాలు ఎర్పాటు చేశామన్నారు. త్వరలోనే చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోనూ సిసి కెమెరాలు ఎర్పాటు చేస్తామన్నారు. మిగిలిన పారిశ్రామిక వాడల్లోనూ అవసరం అయినన్ని సిసి కెమరాలను ఎర్పాటు చేస్తామన్నారు. ఈ కెమెరాల నుంచి ఫీడ్ పిసిబి కార్యాలయానికి, పోలీస్ కార్యాలయానికి పొతుందన్నారు. ఈ ఫీడ్ ఐలాకు సైతం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఫీడ్ మెత్తం మూడు నెలలపాటు (డాటా స్టోరేజి)అందుబాటులో ఉండాలన్నారు. పరిశ్రమల వ్యర్ధాల అక్రమ డంపింగ్ అరికట్టేందుకు టియస్ ఐఐసి తరపున ఒక టీం ఎర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు పోలీసు శాఖ సహాకారం తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ మండళి తరపున అక్రమ డపింగ్ అరికట్టేందుకు అవసరం అయిన మేరకు పోలీసు శాఖ తరపున డిప్యూటేషన్ పై సూమారు 100 మంది అధికారులను తీసుకునేందుకు అవసరం అయిన ప్రాతిపాధనలకు తీసుకువస్తే హోంమంత్రి, డిజిపిలకు ప్రత్యేకంగా ఈ మేరకు ఒక లేఖ రాస్తామన్నారు.
మెత్తం హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల సంఖ్య, వాటి నుంచి వచ్చే వ్యర్దాల పరిమాణం ఏంత, వాటి వ్యర్ధాలను సరఫరా చేస్తున్న వాహనాల సంఖ్య పరిమాణం వంటి అంశాలతో పిసిబి నివేదిక తయారు చేయాలన్నారు. ఈ సమాచారంతో వాస్తవానికి ట్రీట్ మెంట్ ప్లాంట్లకు వస్తున్న వ్యర్ధాలపైన స్పష్టత వస్తుందన్నారు. కాలుష్య వ్యర్ధాల నిర్వహాణలో విఫలం అయిన మున్సిపల్ కార్పోరేషన్లు, జీహెచ్ యంసి, ఇతర ప్రభుత్వ శాఖలకు నోటీసులు ఇచ్చినా ఇబ్బందిలేదు మంత్రి, పిసిబికి తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈపిటిఅర్ఐ సహాకారంతో పనిచేయాలన్నారు. సంగారెడ్డి, పటాన్ చెరు, చౌటుప్పల్ లాంటి చోట్ల కాలుష్య వ్యర్ధాలను బోర్లలో వేస్తూన్న వారిపై చర్యలు తీసుకొవాలని మంత్రి అదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు సంగారెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రత్యేక టీంలను ఎర్పాటు చేసి క్షేత్రస్దాయిలో తీనీఖీలు చేసి కేసులు పెట్టాలన్నారు. ఈ విధంగా కాలుష్యాన్ని కలుగజేస్తున్న పోలేపల్లి సెజ్ లోని రెండు కంపెనీలను మూసివేస్తున్నట్లు పిసిబి అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కంపెనీలపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని అదేశాలు జారీ చేశారు. ఈ కంపెనీల ద్వారా భూగర్భజలాలు కలుషితం అయిన దగ్గరలోని తాండాలు, గ్రామాలకు ప్రత్యేకంగా నీటి సరఫరా చేయాలని అదేశాలు జారీ చేశారు.
నగరంలోని చెరువులు, హుస్సేన్ సాగర్ సుందరీకరణ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈమేరకు పలు చెరువుల నుండి వస్తున్న నురగ పైన వేంటనే పూర్తి స్ధాయి నివేదిక ఇవ్వాలని కోరారు. హుస్సెన్ సాగర్ ప్రక్షాళనకు ఇప్పటికే చాల ప్రయత్నాలు జరిగాయని, మా ప్రభుత్వం వచ్చినాక సైతం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. హుస్సేన్ సాగర్ లోకి మురికి నీరు చేరకుండా 90 శాతం విజయం సాధించామన్నారు. వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా మెత్తం 25మీని కోలనులను అభివృద్ది చేశామని తెలిపారు. ఇప్పటికీ పలు కంపెనీలు అక్రమంగా డంపు చేసే పారిశ్రామిక వ్యర్ధాల మీద కట్టడి లేకపోవడం వలన ఈ సమస్య కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ సుందరీకరణ తాలుకు ప్రతిపాధనలను మంత్రిపరిశీలించారు. ఈసమావేశంలో మేయర్ బొంతు రాంమోహన్, జీహెచ్ యంసి,హెచ్‌యండీఏ,హెచ్‌యండబ్ల్యుయస్‌యస్,పీసీబి శాఖల అధికారులు పాల్లోన్నారు