KTR:అమృత్ స్కీం టెండర్లలో భారీ స్కామ్

4
- Advertisement -

బావమరిది కి సీఎం రేవంత్ రెడ్డి అమృతం పంచుతూ ఆయన కంపెనీకి రూ. 1137 కోట్ల పనులు కట్టబెట్టారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…అర్హత, అడ్రస్ లేని కంపెనీకి ఒక్క రేవంత్ రెడ్డి బావమరది అనే కారణంతో అంత పెద్ద పనులు అప్పగించారు అన్నారు.ఈ కంపెనీకి అప్పగించిన పనులకు సంబంధించి ఎక్కడ వివరాలు లేవు…శోధా కన్ స్ట్రక్షన్ అనే కంపెనీకి ఈ టెండర్లలో రూ. 1137 కోట్ల పనులు కట్టబెట్టారు అన్నారు.

ఈ 2021-22 లో ఈ కంపెనీకి కేవలం రూ. 2.2 కోట్ల లాభం మాత్రమే ఉందన్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరది సృజన్ రెడ్డికి సంబంధించినది. ఈ సంస్థ అడ్రస్ ఎక్కడో కూడా తెలియటం లేదు అన్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఈ కంపెనీకి భారీగా పనులు కట్టబెట్టటం మొదలు పెట్టారు….ఏమాత్రం అనుభవం, అర్హత లేని ఈ కంపెనీకి ముఖ్యమంత్రి బావమరిది అనే కారణంతో క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడ్డారు అన్నారు.

ఈ విషయం కూడా ఎక్కడ మీడియాలో గానీ, ప్రభుత్వ వెబ్ సైట్ లలో కూడా లేదు. ఈ విషయం చాలా రోజులు బయటకు కూడా రాలేదు…ఐహెచ్పీ అనే పెద్ద కంపెనీ తో పాటు శోధా సంస్థకు పనులు ఇచ్చారు. ఐతే ఐహెచ్పీ అనే సంస్థ మొత్తం పనుల్లో మాకు 20 శాతం పనులు వచ్చాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలపటంతో ఈ విషయం బయటపడిందన్నారు. పెద్ద కంపెనీ అయిన ఐహెచ్పీ అనే సంస్థకు కేవలం 20 శాతం పనులే ఇచ్చి…మిగతా 80 శాతం పనులు శోధా కంపెనీకి ఇచ్చారు అన్నారు. నాకు తెలిసి ఈ 20 శాతం పనులు కూడా ఐహెచ్పీ సంస్థకు ఇవ్వరు. ఇంతకన్నా క్రోనీ క్యాపిటలిజం అన్న దానికి ఉదాహరణ ఏముంటుందన్నారు.

అమృత్ పేరుతో బావమరిదికేమో అమృతం పంచి…కొడంగల్ వాసులకు మాత్రం విషం పంచుతానంటే ప్రజలు తిరగబడ్డారు అన్నారు. మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీ కోసం మీరు కొడంగల్ ను బలి పెట్టే పనిచేస్తున్నారు. అందుకే ప్రజలు తిరగబడ్డారు అన్నారు. రుణమాఫీ, రైతుబంధు, ఫించన్ల పెంపు, తులం బంగారానికి మాత్రం పైసలు లేవు. కానీ సిగ్గు లేకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో రూ. 300 కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చేందుకు పైసలు ఉన్నాయి అన్నారు.

తెలంగాణ ప్రజల సొత్తు మీ అబ్బ సొత్తు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్లు…చేయని పనులను చేసినట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు. రాహుల్ గాంధీయేమో తెలంగాణలో మహిళలకు రూ. 2500 ఇస్తున్నామంటున్నారు. ఒక్క మహిళకైనా రూ. 2500 ఇచ్చినట్లు రాహుల్ గాంధీ నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణలో చేయని పనులు చేస్తున్నామని అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారు…ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడితే క్రోనీ క్యాపిటలిజం గురించి మాట్లాడాతారు..కానీ తెలంగాణలో ఆయన పార్టీ ముఖ్యమంత్రే పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ లను క్రోని క్యాపిటలిజం చేస్తూ తన వారికి అప్పగిస్తున్నారు అన్నారు.

నెల రోజుల క్రితమే అమృత్ టెండర్లకు సంబంధించి తెలంగాణలో జరిగిన స్కామ్ కు సంబంధించి వివరాలతో కేంద్ర మంత్రికి లెటర్ రాయటం జరిగింది…అమృత్ స్కీం లో భాగంగా తెలంగాణలో దాదాపు రూ. 8,888 కోట్ల పనులకు టెండర్లను పిలిచారు అన్నారు.దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, అదే విధంగా బీజేపీ నేతలకు ప్రశ్నించేందుకు ఢిల్లీకి వచ్చాను…బీజేపీ నేతలు మాట్లాడితే క్రోనీ క్యాపిటలిజం అని అంటుంటారు. మరి దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు అన్నారు.ఈ స్కామ్ కు సంబంధించిన పూర్తి వివరాలతో నేను కేంద్రమంత్రికి నిన్న వివరాలను అందజేశాను…ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి పారదర్శక విచారణ జరిపి అక్రమాలు జరిగితే వెంటనే టెండర్లను రద్దు చేయాలన్నారు. అవసరమైతే సీవీసీ గానీ ఇంకా ఏ సంస్థలతో విచారణ జరిపిస్తారో జరిపించండి..ఎందుకంటే ఈ టెండర్లకు సంబంధించి ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారు అన్నారు.ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించినందుకు చాలా శక్తి మంతులైన వాళ్లు పదవులు పొగొట్టుకున్నారు…సోనియాగాంధీ గారు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రెండు పదవులు ఉండకూడదంటే ఒక పదవిని వదులుకున్నారు అన్నారు..

ఇలా చాలా సంఘటనలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉన్నాయి. జార్ఘండ్ ముఖ్యమంత్రి సోరెన్ కేటాయించిన గనుల కేటాయింపులో కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘన జరిగింది..తెలంగాణలోనూ అమృత్ టెండర్లలో ఇదే విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారు అన్నారు.

Also Read:KTR: ఆగమైపోతున్న తెలంగాణ

- Advertisement -