సమంతపై కేటీఆర్‌ ప్రశంసలు..

243
Ktr Praises Samantha
- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది సమంత. మరోవైపు సేవ కార్యక్రమాలలో సమంత బిజీగా ఉంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పలు సేవలు అందిస్తున్న ఈ బ్యూటీ  తెలంగాణలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ … సమంతపై ప్రశంసలు గుప్పించారు. చేనేతను ప్రోత్సహించేలా హీరోయిన్ సమంత ముందుడుగు వేయడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం మంచి పరిణామమని ట్విటర్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే పలుసార్లు తెలంగాణలో చేనేత కార్మికులు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పర్యటించిన సమంత గత శుక్రవారం(మార్చి 10) సిద్దిపేటలో పర్యటించారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తనకు తెలిసిన ప్రముఖ డిజైనర్లను వెంటేసుకుని చేనేత కార్మికుల వద్దకు వెళ్ళిన సమంత, డిజైనర్‌ తరహా వస్త్రాల్ని రూపొందించడంపై వారికి ఆయా డిజైనర్లతో సలహాలు ఇప్పించడమే కాకుండా, మార్కెటింగ్‌ విషయమై వారికి భరోసా ఇచ్చింది. తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు.

ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను సందర్శించారు. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్‌ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. చేనేత సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

- Advertisement -