రాచకొండ పోలీసులపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ట్రాఫిక్ నిబంధనల విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి చేపడుతున్న చర్యల పట్ల ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాల పేరుతో జరిమానాలు విధించకుండా వారితో హెల్మెట్స్ కొనించాలని, మిగితా ధృవ పత్రాలు పొందేలా ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా కేటీఆర్ సైతం ప్రశంసలు గుప్పించారు. వాహన చోదకులకు జరిమానాలు విధించకుండా, వారితోనే హెల్మెట్లు కొనేలా చేయాలనీ, మిగితా ధృవ పత్రాలు సైతం వీలైనంత త్వరగా వారికందేలా చర్యలు తీసుకోవాలని‘గుడ్ మూవ్’ అని ప్రశంసించారు.
ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న వాహనదారులకు సినిమా టికెట్లను బహుమతిగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పోలీసులు తాజాగా చేపట్టిన కార్యక్రమంపై వాహనదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Good move @RachakondaCop 👍👏 https://t.co/oM1IMqluIg
— KTR (@KTRTRS) September 14, 2019