KTR:ప్రజల మనిషి పజ్జన్న

23
- Advertisement -

సికింద్రాబాద్ ప్రజల మనిషి పజ్జన్న అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..2001 నుంచి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ హైదరాబాద్ మహానగరంలో గులాబీ జెండాని రెపరెపలాడిస్తున్నారని చెప్పారు.

ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్‌.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనమన్నారు. నాలుగు దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని…కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా.. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని వెల్లడించారు. పార్లమెంటులో పద్మారావు గౌడ్ గళం.. సికింద్రాబాద్‌కు బలమంటూ పేర్కొన్నారు.

Also Read:ప్రేక్షకులు ఎంజాయ్ చేసే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’

- Advertisement -