మహానటి అద్భుతం… కేటీఆర్ ప్రశంసలు

211
KTR Praises Mahanati Movie
- Advertisement -

తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లెజండరి నటి సావిత్రి బయోపిక్ మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగలిగిన సినిమాలు కూడా భారీ వసూళ్లను, మంచి ఓపెనింగ్స్‌ను సాధించగలవు అని మరోసారి నిరూపించింది ‘మహానటి’.

యూఎస్‌లో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రీమియర్ వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్స్ ప్రదర్శనతో ఈ సినిమా దాదాపు మూడు లక్షల డాలర్ల వసూళ్లను సాధించిందని సమాచారం. ఇక ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం పొందుతోంది. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు,రాజమౌళితో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.

తాజాగా మంత్రి కేటీఆర్‌..మహానటి సినిమా బాగుందని కితాబిచ్చారు. మ‌హాన‌టి చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌ని… ఎంత‌గానో అల‌రించిందని ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా కొనియాడారు.

స‌రిగ్గా మే 9న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రం వైజ‌యంతి బ్యాన‌ర్‌లోనే విడుద‌లై సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఇప్పుడు మ‌హాన‌టి కూడా భారీ రికార్డులు తిర‌గరాసే దిశ‌గా దూసుకెళుతుంది. దీంతో నిర్మాత అశ్వినీదత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -