KTR: హైద‌రాబాద్ ప్రజల చైత‌న్యానికి పాదాభివంద‌నం

6
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క సీటు ఇత‌ర పార్టీల‌కు ఇవ్వ‌కుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు కేటీఆర్. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల చైత‌న్యానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా అన్నారు. రాజేంద్ర న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌శ్చాత్త‌ప ప‌డే రోజు వ‌స్త‌దన్నారు. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు మాత్ర‌మే ఉంటాయన్నారు.

పార్టీలో కార్తీక్ రెడ్డి పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శిస్తున్నారు అన్నారు. మీ అంద‌రితో ప్రార్థ‌న ఒక్క‌టే.. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం క‌లుగుతుందన్నారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా.. మాకు ఎవ‌రు మేలు చేస్తారో ఎవ‌రు చేయ‌రో అర్థం అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read:ధర్మం కోసం పోరాడుతాం: పవన్

- Advertisement -