మూసీ పేరుతో లూటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు.. సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి…రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక జేసీబీలతో, కూలీలను పెట్టి ఇండ్లు కూలగొడుతున్నారు అని మండిపడ్డారు. ఇందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని ప్రజలకు అర్థమైందన్నారు.
తన పాపం బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి….తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారు అని విమర్శించారు.
Also Read:కక్ష సాధింపులకు వెళ్లకండి: చంద్రబాబు
420 హామీలతో ప్రజల గొంతు కోశారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయింది. ఈ ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే.. నోట్ల రద్దు చేసినప్పుడు మోదీ చెప్పిన మాటల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.