KTR: సురేఖపై కేటీఆర్ పిటిషన్ విచారణ

6
- Advertisement -

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలు అయిన సంగతి తెలిసిందే.

సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా చేశారు. నాంపల్లి ప్రత్యేక మెజిస్ట్రేట్‌‌ కోర్టులో పిటిషన్‌‌ వేశారు కేటిఆర్. వీడియోలు సహా 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు కేటీఆర్ న్యాయవాదులు. ఈకేసులో సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

Also Read:పెళ్లిళ్ల సీజన్ షురూ..

- Advertisement -