సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం: కేటీఆర్

214
ktr harith haram
- Advertisement -

మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఆరవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు పురపాలకమంత్రి కేటీఆర్. మంత్రులు మల్లారెడ్డి,తలసాని, ఎమ్మెల్యే వివేకానంద,మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు,నవీన్ రావు, మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మొక్కలు నాటారు మంత్రి కేటీఆర్.

దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 వద్ద మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికను ఆరేళ్ల కింద ప్రారంభించారని….ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నర్సాపూర్ లో ప్రారంభించారు అని చెప్పారు.

రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంపొందించి హరిత శోభితం చేస్తామని….2వందల30కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. ఓఅర్ ఆర్ పక్కన హెచ్ ఎమ్ డీ ఏ భూమిలో ఆరున్నర లక్షల మొక్కలు మియావకి మోడల్ తరహాలో నాటబోతున్నాం అన్నారు.

యాదాద్రి మోడల్ కింద ఆరున్నర లక్షలు నాటుతాం అని హరిత ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్ళితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి ఇచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలన్నారు.

మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలని…అటవీ శాతాన్ని పెంచి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం అన్నారు.అందరూ కూడా ఇచ్ వన్ ప్లాంట్ వన్ అని మొక్కలు నాటాలని..హరిత ఉద్యమ స్పూర్తితో దీన్ని తీసుకు వెళ్ళాలన్నారు.

పెట్టిన మొక్కలు అందరూ సంరక్షించుకోవాలి..ప్రభుత్వ కార్యక్రమం లా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకోవాలి…పెట్టిన ప్రతి మొక్కను కాపాడుకోవాలన్నారు

- Advertisement -