తలసాని శంకర్ మృతి..కేటీఆర్ సంతాపం

9
- Advertisement -

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్ మరణం పట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులుగా, బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షులుగా వ్యాపారులకు మేలు చేసేందుకు ఆయనెంతో కృషి చేశారు.

కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన త్వరలోనే కోలుకుంటారని భావించాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్..ఈ క్లిష్టసమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని… వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Also Read:NBK 109:బర్త్ డే గ్లింప్స్ అదుర్స్

- Advertisement -