KTR:తెలుగు వారికి తీరని లోటు

6
- Advertisement -

రామోజీ రావు మరణం తెలుగు వారికి తీరని లోటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈనాడు అధినేత రామోజీ రావు పార్థివ‌దేహానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి నివాళుల‌ర్పించారు.

తెలుగు ప‌త్రికా రంగంతో పాటు తెలుగు ప్ర‌సార మాధ్య‌మాల్లో ఒక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుకు రామోజీ రావు బీజం వేశారన్నారు. ప్రొఫెష‌నిల‌జంతో, విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజానికి రామోజీ రావు గుర్తుగా నిలిచిపోతారన్నారు.

తెలుగు ప్ర‌జ‌లు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల‌ గురించి గొప్ప‌గా మాట్లాడేవారు. ఎన్నో సంద‌ర్భాల్లో ఇదే ఫిలిం సిటీలో వారిని క‌లుసుకునే అవ‌కాశం త‌న‌కు ల‌భించింది. మొబైల్ ఎన్‌సైక్లోపీడియా లాగా అన్ని విష‌యాలు చెప్పేవారు. రామోజీ మృతి తెలుగు ప‌త్రికా రంగానికే కాకుండా ప్రపంచంలోని తెలుగు వారంర‌దికీ తీర‌ని లోటు అని పేర్కొన్నారు. ఎప్ప‌టికీ తెలుగు జాతి ఆయ‌న‌ను గుర్తు పెట్టుకుంటుంది అని పేర్కొన్నారు.

Also Read:మైత్రీ మూవీ మేకర్స్… ‘8 వసంతాలు’

- Advertisement -