నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేస్తూ.. పీవీ నరసింహా రావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు చరిత్రాత్మకం…తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది అన్నారు.
పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్‌కి, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టింది.. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపింది. పీవీ గారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించింది అని చెప్పారు.
Also Read:29 నుండి అసెంబ్లీ సమావేశాలు

