ప్రొ.సాయిబాబాకు కేటీఆర్ నివాళి

5
- Advertisement -

ప్రొ. సాయిబాబా భౌతిక కాయానికి నివాళి అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ మౌలాలిలో ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయానికి వెళ్లిన కేటీఆర్… నివాళుల‌ర్పించారు.

హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అన్నారు కేటీఆర్. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను… దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు అన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్, బాల్క సుమ‌న్, ప‌ల్లె ర‌వి కుమార్, తుల ఉమ‌తో పాటు ప‌లువురు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

Also Read:చంద్రబాబుతో చిరు

- Advertisement -