మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్

7
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ మండలం నేరళ్ల పల్లి లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లక్ష్మా రెడ్డి మొదటి నుండి ఉద్యమం లో ఉన్న నాయకుడు… మృదు స్వభావి అన్నారు. ఆయనకు ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరం…పాలమూరు జిల్లా లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం అన్నారు.

క్రిస్టియన్ పల్లి సర్వే నెంబర్ 523 లో 75 ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు…2007 సంవత్సరం లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది… సింహ భాగం దివ్యాంగులు, అంధులు, దళితులు, నిరుపేదలు ఉన్నారు అన్నారు. 75 గజాల చొప్పున నిరుపేదలకు పట్టాలు ఇచ్చారు..కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గా వున్నపుడు మహబూబ్ నగర్ లో 4000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందించామన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చిన పట్టాల్లో ఉన్న ఇండ్లు కూల్చివేసింది..కు సంస్కారం గా, నోటిస్ లేకుండా నేల మట్టం చేశారు.వాళ్ళని నడిరోడ్డు మీద నిలబెట్టారు అన్నారు. పాలమూరు పేదల పొట్ట కొట్టడానికా నువ్ ముఖ్యమంత్రి అయింది..కెసిఆర్ గారి మానవీయ కోణం లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందన్నారు.

పాలమూరు బిడ్డలకు నిజాలేంటో తెలియజేస్తాం..ఏ కంపెనీ లను భూతులు తిట్టావో అదే కంపెనీ లకు పనులు కట్ట బెట్టావ్ అన్నారు. ప్రతి పుంపు హౌస్ దగ్గరికి పోతాం… ప్రతి రిజర్వాయిర్ కి పోతాం..భూములు కోల్పోయిన పాలమూరు బిడ్డలకు నిజాలు తెలియజేస్తాం అన్నారు.

Also Read:4 కొత్త విమాన సర్వీసులు:రామ్మోహన్

- Advertisement -