KTR:లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటాం

27
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత చనిపోయిన విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యానని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. లాస్య నందిత కుటుంబాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి,గువ్వల బాల్ రాజ్. మహమూద్ అలీలతో కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్… విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను అని తెలిపారు. ఆ అమ్మాయిని గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయి…గత ఏడాది వారి నాన్న సాయన్న చనిపోయారు…ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరం అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని… కుటుంబానికి దైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న అన్నారు.

Also Read:TDP :నో టికెట్.. షాక్ లో సీనియర్స్!

- Advertisement -