ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌దే అధికారం

11
- Advertisement -

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌దే అధికారం అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కేటీఆర్. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తుఫాన్ వేగంతో అధికారంలోకి వస్తుంది అని తేల్చిచెప్పారు.

అంబేద్కర్ అమెరికా కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుకోవడానికి బరోడా మహారాజ్ ఆశీర్వదించి పంపారు.. బరోడా మహారాజ్ ఒక అంబేద్కర్ ని దీవించి అమెరికా పంపించారు అన్నారు. మన ప్రభుత్వ హయాంలో 1022 పాఠశాలలు పెట్టి వేలాది మంది పిల్లలను గొప్పగా చదివించి, ఉన్నతమైన చదువులకు అమెరికాకు పంపించాం అని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట అంబేద్కర్ అభయహస్తమని చెప్పి రూ.12 లక్షలు ఇస్తామని మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు.. రూ.12 లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు డబల్ బెడ్ రూమ్ కి రూ.5 లక్షలు కాదు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు.. ఏమైంది మీ రూ.12 లక్షలు మాట చెప్పాలన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు 28 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కలిపిస్తామని చెప్పారు.. ఇదెందుకు చేయలేదు రేవంత్ రెడ్డి?, ఎస్సీ, ఎస్టీలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే లక్ష, పీహెచ్డీలు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైందని నేను అడుగుతున్నాను చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం రూ.5000 విరాళం ఇచ్చారు HCU అంధ విద్యార్థి సంగమేశ్వర్.

Also Read:అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు

- Advertisement -