KTR:చాకలి ఐలమ్మకు జోహార్లు

4
- Advertisement -

బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా చాకలి ఐలమ్మ నిలిచారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు.

తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన కేటీఆర్… చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని గుర్తు చేశారు.

 

Also Read:BB9:షాంపో గురించి రచ్చరచ్చ

- Advertisement -