- Advertisement -
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడింది అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగింది… హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారు అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. వారి ఆశయాల సాధనకు పునరంకితమవుదాం…జోహార్ అంబేద్కర్! జై భీమ్ అని తెలిపారు.
Also Read:BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!
- Advertisement -

