KTR:ప్రమాదంలో భారత రాజ్యాంగం

18
- Advertisement -

కొన్ని పార్టీల తీరుతో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…అంబేద్కర్‌ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏండ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్..అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసిందన్నారు. విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని, ప్రగతి తోనే సమానత్వం వస్తుందన్న అంబేద్కర్ ఆలోచన విధానంతో 1022 గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు కేటీఆర్.

ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌కే సాధ్యమైందని తెలిపారు. అంబేద్కర్ కేవలం ఒక్క జాతికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన అందరి మనిషని చెప్పారు.సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

Also Red:టీడీపీ రెడీ..బీజేపీ నాట్ రెడీ?

- Advertisement -