బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా సుష్మా సేవలను గుర్తుచేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…సుష్మా స్వరాజ్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
Heartfelt condolences on the demise of former Union Minister Smt #SushmaSwaraj Ji. Telangana people will forever remember her support to the statehood cause. RIP Chinnamma 🙏🙏
— KTR (@KTRTRS) August 6, 2019
సుష్మా స్వరాజ్‌తో భేటీయైన ప్రతిసారీ ఎంతో ప్రేరణతో బయటకు వచ్చేవాడినని ట్వీట్ చేసిన కేటీఆర్… ఆమె నిజమైన నాయకురాలు. ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న భారతీయులెవరైనా ఆపదలో చిక్కుకొని సాయం కోరుతూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు తక్షణం స్పందించి పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సుష్మా స్వరాజ్‌ను గుర్తుంచుకుంటారని చెప్పారు.
Every time I met her, came out with more admiration for the warmth she exuded & grace of her reception. A true leader, who gave the confidence to Indians in distress anywhere in the world that help was just one tweet away 🙏
You’ll be missed by all Madam. RIP #SushmaSwaraj Ji pic.twitter.com/Xe4sJVxPMq
— KTR (@KTRTRS) August 7, 2019