నాలుగేళ్ల నిరీక్షణకు తెర..సిర్పూర్‌కు పూర్వవైభవం

257
KTR Participates Sirpur Paper Mill
- Advertisement -

మంత్రి కేటీఆర్,ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కృషితో సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ పనులకు కేటీఆర్ పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మిల్లు మీద ప్రత్యక్షంగా,పరోక్షంగా 10 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత కార్మికులదే అని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సంకల్పంతోనే పేపర్ మిల్లు పునరుద్ధరణ సాధ్యమైందన్నారు. పేపర్ మిల్లు ఉద్యోగులకు దశల వారీగా అన్ని విధాల రాయితీలు అందిస్తామన్నారు.

ఉపాధి కల్పన జరిపించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని …మిల్లును టేకోవర్ చేసిన జేకే గ్రూప్‌కు రూ. 30 వేల కోట్ల టర్నోవర్ ఉందన్నారు.పేపర్ మిల్లు పునరుద్ధరణ చేసేందుకు కోనేరు కొనప్ప ఎంతో కృషి చేశారని తెలిపారు. డిసెంబర్‌ కల్లా పేపర్ మిల్లులో ఉత్పత్తి జరుగుతుందన్నారు.

కొత్త పరిశ్రమలను తెస్తున్నాం.. మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ కొంతమంది తమ స్వార్థం కోసం కార్మికుల్లో విభేదాల్లో సృష్టిస్తున్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలో మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

- Advertisement -