ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలి :కేటీఆర్‌

103
- Advertisement -

మునుగోడులో ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బంగారి గడ్డ నుంచి చండూరు వరకు తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేటీఆర్‌ పాల్గోని అనంతరం ప్రసంగించారు.

మునుగోడు దత్తత తీసుకుంటా
ఈ సందర్భంగా కేటీఆర్‌ ర్యాలీలో మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజక వర్గమును దత్తత తీసుకుంటానని కేటీఆర్‌ ప్రకటించారు. నవంబర్‌6 తర్వాత మునుగోడును అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ప్రతి పనిలో ముందుండి ప్రగతి పథంలో దూసుకెళ్లేలా చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలని అని అన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసం ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గానికి గడిచిన నాలుగు సంవత్సారాల్లో ఏం చేశావో చెప్పాలన్నారు.

బీజేపీ మోసాలు
దేశంలో బీజేపీ విధానాల వల్ల ప్రజలు కష్టాల పాలవుతున్నారని మండిపడ్డారు. ఆయ‌న కంటే ముందున్న 14 మంది ప్ర‌ధాన‌మంత్రులు చేయ‌ని దుర్మార్గాన్ని చేసి, చేనేత‌కు మ‌ర‌ణ శాస‌నం రాశారు. ఈ రోజు చేనేత మీద 5 శాతం జీఎస్టీ విధించారు. చేనేత బంద్ అయిపోయే రోజును మోదీ తీసుకొస్త‌రు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును ర‌ద్దు చేశారు. నేత‌న్న‌కు ఇచ్చే బీమా ప‌థ‌కాన్ని ఎత్తేశాడు. చేనేత మీద పన్ను వేసి వారికి మరణశాసనం రాసిన మోదీని గద్దే దించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్న రైతన్నలను బండ్లతో గుద్ది చంపిన బీజేపీ నాయకులను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ది పథంలో దూసకుపోతుంటే బీజేపీ నాయకులకు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.

ఫ్లోరైడ్‌ సమస్య
కృష్ణానది నల్లగొండ జిల్లాకు ఆనుకొని పోతున్న ఒక్క రిజర్వాయర్‌ కట్టలే… కనీసం తాగడానికి మంచినీరు ఇవ్వలేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.కృష్ణాలో 811 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మనకు రావాల్సిన 575 టీఎంసీలు ఇవ్వాల‌ని కోరాం. కానీ స్పంద‌న లేదు. నీళ్ల‌లో వాటా తేల్చ‌కుండా చావ‌గొడుతున్నారు. అయిన ఎక్కడ కూడా తగ్గకుండ… నేడు కేసీఆర్‌ చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్‌ కట్టి రెండున్నర లక్షలకు నీరు ఇవ్వబోతున్నామని త్వరలో లక్ష్మణపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఫ్లోరైడ్‌ జిల్లా అని అనేవారని…కానీ నేడు అలాంటి దుస్థితి లేదన్నారు. గతంలో తాగు నీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వయి ఈ ఉమ్మడి జిల్లాకు చేసింది ఏమిలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2006లో 32మండలాలు తిరుగుతూ స్వయంగా కేసీఆర్‌ పాట రాశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్‌ బండ అని పాటి రాసిన నాటి నాయకుడు…నేడు నల్లగొండలో ఫ్లోరైడ్‌ను బొంద పెట్టారని తెలిపారు.

రైతుభాంధవుడు
సీఎం కేసీఆర్‌ రైతుభాంధవుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కాపీ కొట్టి అమలుపరుచుకుంటున్నాయని అన్నారు. గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నాం. తాగు, సాగునీటితో పాటు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకొని 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు.

1996లో న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 400 మంది నామినేష‌న్లు వేసి దేశ దృష్టిని ఆక‌ర్షించారు. కానీ ప‌రిష్కారం దొర‌క‌లేదు. కేసీఆర్ వ‌చ్చాక ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త విముక్తి క‌ల్పించామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రైత‌న్న‌, గీత‌న్న‌, నేత‌న్న కోసం ప‌ని చేసే నాయ‌కుడిని గెలిపించుకుందామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -