కేటీఆర్..ఎన్నికల ప్రచార షెడ్యూల్

290
ktr election campaign
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో ప్రచారంలో దూకుడుపెంచింది టీఆర్ఎస్. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నికల టూర్ షెడ్యూల్ ఖరారు కాగా తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 9వరకు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రచారం చేయనున్నారు.ప్రచారంలో భాగంగా, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు.

ఈ నెల 27న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ సభ ప్రారంభమై ఏప్రిల్‌ 9న నల్గొండలో జరిగే రోడ్‌ షోతో ముగియనుంది. మార్చి 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 30న నర్సంపేట, ములుగుతో పాటు తాండూరు, వికారాబాద్‌ కేటీఆర్ పర్యటించనున్నారు. 31న రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండలం, వికారాబాద్ జిల్లాలోని పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు కేటీఆర్.

ఏప్రిల్ 1వ తేదీన ఎల్బీనగర్, మహేశ్వరంలో రోడ్‌షోలు, ఏప్రిల్ 2న సిరిసిల్ల రూరల్, ఉప్పల్, మల్కాజ్‌గిరిలో పర్యటించనున్నారు. 3వ తేదీన హుజుర్‌నగర్‌,సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

4న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ, అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌షోలు ఉండనున్నాయి. 5న కోదాడలో బహిరంగసభ, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలు, ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 7న మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లో నిర్వహించే సభలతో పాటు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసే రోడ్‌షోల్లో కేటీఆర్ పాల్గొంటారు. 8న ఇల్లెందు, పినపాకలో బహిరంగ సభలు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో రోడ్‌షోలు ఉంటాయి. ఏప్రిల్ 9న నల్లగొండలో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు. ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్ సభలతో 16 పార్లమెంట్ స్ధానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగనున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు,.

- Advertisement -