BRS…తెలంగాణ ఆత్మగౌరవం

14
- Advertisement -

2025 బీఆర్ఎస్ పార్టీకి కీలకమైన సంవత్సరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రెండు తెలుగు రాష్ట్రాలలో‌ ఎన్నో పార్టీలు పుట్టాయి.. కాలగర్భంలో కలిసిపోయాయి అని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాన్ని ఎల్కతుర్తిలో నిర్వహిస్తాం …అరవై లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అటవీ భూమిని ICICI బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ. 10,000 కోట్లు అప్పు తెచ్చింది నిజం అని స్వయంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారన్నారు. ఇవ్వాళ ఒక ఫేక్ లెటర్ సృష్టించి.. చేసిన భారీ కుంభకోణాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ డ్రామాలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అన్నారు.

#HCU కంచ గచ్చిబౌలి 400 ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాం అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుంటే, ఏం లేదని ఒక కాంగ్రెస్ మంత్రి అబద్దాలు చెప్తున్నడు అన్నారు. కాంగ్రెసోళ్లు ఒక దగ్గర కూర్చుని అమ్మిండ్రా, తాకట్టు పెట్టిండ్రా, దోచుకున్నారా.. మాట్లాడుకొని స్పష్టంగా బయటకు రండి…కంచ గచ్చిబౌలి భూములపై.. దేశంలోనే అతి పెద్ద ఫ్రాడ్ చేసింది రేవంత్ సర్కార్ అని దుయ్యబట్టారు.

తెలంగాణ ఇంటి పార్టీగా.. కోట్లాది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది బీఆర్ఎస్.. 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను లక్షలాది మందితో ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు.

Also Read:ఈవీఎంలు హ్యాకింగ్..మళ్లీ రచ్చ!

- Advertisement -