ప్రధానమంత్రి నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్‌కు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు.
టీఆర్‌ఎస్‌కు 9,ఎంఐఎం ఒక స్ధానంలో గెలిచిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామన్నారు. 16 సీట్లు గెలవాలని మేము కోరుకున్నామని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి,నవీన్ పట్నాయక్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు,ఓటములు సహజం అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తామన్నారు. ప్రజల తీర్పు ఎందుకు భిన్నంగా వచ్చిందో పార్టీలో చర్చిస్తామన్నారు. ప్రజల తీర్పే శిరోధార్యమని చెప్పారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్‌లు అని చెప్పిన కేటీఆర్ టీఆర్ఎస్‌కు మెజార్టీని కట్టబెట్టారని తెలిపారు. ప్రజా సేవకే పునరంకితం అవుతామని చెప్పారు. ఎవరితోనూ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడబోమన్నారు.
చాలా మంది ప్రముఖులు ఎన్నికల్లో ఓడిపోతారు .కవిత ఓటమి చెందితే కారణాలను తెలుసుకుంటామన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ,బీజేపీ కుమ్మక్కయ్యాయని అంటున్నారు….కవిత మీద పోటీ చేసిన 180 మంది రాజకీయ కార్యకర్తలే .రైతులు కారని చెప్పారు.