దేశ చరిత్రలో అరుదు.. 50 లక్షల టీఆర్ఎస్ సభ్యత్వాలు: కేటీఆర్

654
ktr telangana bhavan
- Advertisement -

50 లక్షల సభ్యత్వాల నమోదుతో టీఆర్ఎస్ దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యయాన్ని సృష్టించిందని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. నెల రోజుల్లోనే టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు.

ఇంకా కొన్ని జిల్లాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోంది. సభ్యత్వాల నమోదులో కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీల ఏర్పాటు తర్వాత త్వరలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని చెప్పారు. దేశంలోనే క్రమశిక్షణ గల కార్యకర్తలుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను తీర్చిదిద్దుతామని చెప్పారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని ..మున్సిపాలిటీల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారని…. ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోమని చెప్పారు.

టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ తరపున రూ. 2 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. బీమా కంపెనీకి ప్రీమియం మొత్తాన్ని ఈ రోజే అందజేశామన్నారు. రూ. 11 కోట్ల 21 లక్షల బీమా ప్రీమియం చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ అందజేశారు.

- Advertisement -