తెలంగాణలో తగ్గిన రేషన్ కార్డులు: కేటీఆర్

3
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు తగ్గాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డిది దౌర్భాగ్యమైన ప్రభుత్వం అని.. గణాంక సారాంశంలో కేసీఆర్‌ను పొగిడినట్టు ఉందని వెబ్‌సైట్ విడుదల చేసిన కాసేపటికే తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉంటే.. 1వ స్థానంలో పెట్టి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాము అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే రెండు రెట్లు పెరిగిందన్నారు. తెలంగాణ దివాళా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్న ఈ సన్నాసుల నోరు మూపించేలా ఈ గణాంక సారాంశం ఉందన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్‌ను తిట్టుడు, బూతులు మాట్లాడటం, తెలంగాణను శాపం పెట్టుడు బంద్ చేయి యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు. తెలంగాణను ఎవరు తిట్టినా వాళ్లకు ఇలానే సమాధానం చెప్తాను అన్నారు. నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చావు, ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడావు అన్నారు.

రేవంత్ రెడ్డి నువ్వు మూర్ఖుడువి.. మీ ఉపముఖ్యమంత్రి ఇచ్చిన నివేదిక చదివి సిగ్గు తెచ్చుకో అన్నారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కాదు దాదాపు 1000 రేషన్ కార్డులు తగ్గాయి అన్నారు. ఈ నివేదిక ఎవరో ఇచ్చింది కాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిందే పోయిన నెల జనవరి వరకు అప్పులకు మీరు కట్టిన మిత్తి రూ.22 వేల 56 కోట్లు అన్నారు. అంటే 10 నెలల్లో మీరు కట్టింది నెలకు రూ.2200 కోట్లు మరి రేవంత్ రెడ్డి నెలకు రూ.6,500 కోట్లు మిత్తి కడుతున్నామని సిగ్గులేకుండా చెప్తున్నాడు అన్నారు.

Also Read:యూపీఐ యాప్స్‌తో పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా!

- Advertisement -