అసెంబ్లీ 15 రోజులు నడపాలి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి?… అది పీసీ ఘోష్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలి అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలి… మీకు నచ్చిన రెండు మూడు అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదు అన్నారు.
అంతకముందు గణపతి బప్పా మోరియా కావలయ్యా యూరియా అంటే…గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిదంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డుల ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:అసెంబ్లీ సమావేశాలు..బీఆర్ఎస్ నిరసన

