KTR: దవాఖానల్లో విద్యార్థులు..చెరసాలలో రైతన్నలు

2
- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట అని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్….రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట!..పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదికెక్కి పిట్టలదొర మాటలు చెబుతుండు ! అన్నారు. దవాఖానల్లో విద్యార్థులు,చెరసాలలో రైతన్నలు,ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారన్నారు.

 

Also ReadGautam Adani: గౌతం అదానీకి షాక్‌.. అరెస్టు వారెంట్

 

- Advertisement -