గురుకుల విద్యార్థి ఆత్మహత్య బాధాకరం!

7
- Advertisement -

గురుకుల హాస్టల్ లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణం అని మండిపడ్డారు.

పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్న చిన్నారులు కనీస సౌకర్యాలు లేని హాస్టల్లో ఉండలేక చివరికి ప్రాణాలు తీసుకోవడం గురుకులాల దుస్థితికి అద్దం పడుతోంది అన్నారు.

ఇప్పటికే గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా ముఖ్యమంత్రికి సోయి రావడం లేదు.. ఇప్పటికైనా గురుకులాల్లో మోగుతున్న ఈ మరణమృదంగాన్ని ముఖ్యమంత్రి ఆపకపోతే తల్లిదండ్రుల శాపనార్థాలు తగిలి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయం అన్నారు.

 

Also Read:KTR:ఇందిరమ్మ రాజ్యంలో ‘బిందె’ సేద్యమా?

- Advertisement -