KTR:కేసీఆర్ మహాసంకల్పం నేరవేరింది

10
- Advertisement -

మరో స్వప్నం సాకారమైన క్షణమిది..కేసిఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజిది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఉన్న క‌రువును శాశ్వ‌తంగా పార‌దోలే వ‌ర‌ప్ర‌దాయినికి కేసీఆర్ జీవం పోశార‌ని కొనియాడారు.

సీతారామ ప్రాజెక్టు ప‌నుల‌ను శ‌రవేగంగా ప‌రుగులు పెట్టించి, ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌ను త‌యారు చేసి యుద్ధ ప్ర‌తిపాదిక‌న అమ‌లు చేశార‌ని పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు.. దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.జై తెలంగాణ.. జై సీతారామ ప్రాజెక్టు అని ట్వీట్ చేశారు.

- Advertisement -