ప్రమాణపత్రం ఇస్తేనే రైతుభరోసా పైసలు ఇస్తాం అనడం సరికాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన అన్నారు.. మొన్నటి దాకా కుల గణన, ఇప్పుడ మళ్లా కొత్తగా ప్రమాణ పత్రం ఇవ్వాలని అంటున్నారు. ప్రమాణపత్రం ఇస్తేనే రైతుభరోసా పైసలు ఇస్తాం అంటున్నారు అన్నారు.
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రజాపాలన అని కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం కోటి 6 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా..? ఇప్పుడేందుకు కొత్తగా రైతులను ప్రమాణపత్రాలు అడుగుతున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీలు ఇచ్చారు. ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడేమో రైతులు ఊర్లలో ప్రమాణపత్రం ఇవ్వాలట. ఇంతకంటే విచిత్రమైన ముచ్చట వినలేదు. రైతును శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చారు. వీళ్లేమో రైతును యాచించే స్థాయికి తీసుకెళ్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:2024: శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు