ప్రజల కోసమే పనిచేస్తాం: కేటీఆర్

3
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అవినీతిని, ప్రజలకు పెట్టిన ఇబ్బందులపై మా పార్టీ చేసిన పోరాటానికి, ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన “నమ్మి నానపోస్తే” అనే షార్ట్ ఫిలిం ని కేటీఆర్ విడుదల చేసి, పార్టీ నేతలతో తిలకించారు.

గత ఏడాది కాలంలో జరిగిన సంఘటనలు, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులు, పోలీసు కేసుల పేరుతో చేసిన కుట్రలను అన్నింటిని దాటుకొని ఈ రోజు భారత రాష్ట్ర సమితి తిరిగి బలంగా నిలబడిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి మోసపోయి గోసపడుతున్న తెలంగాణ సమాజం తీరును రసమయి బాలకిషన్ కళ్ళకు అద్దినట్లు ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారని కేటీఆర్ అన్నారు. ప్రతినెల ఇదేవిధంగా, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని, మోసాలను వివిధ రూపాల్లో గుర్తు చేస్తామని కేటీఆర్ కి రసమయి బాలకిషన్ తెలిపారు.

Also read:మహేష్ బాబు దర్శకత్వంలో రామ్

- Advertisement -