కాంగ్రెస్‌ గుండాల దాడిని ఖండిస్తున్నా!

4
- Advertisement -

హైదరాబాద్….రహమత్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ను పరామర్శించారు కేటీఆర్,సునీత గోపీనాథ్. మా కార్యకర్త పై జరిగిన దాడిని ఖండిస్తున్నా..జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోంది అన్నారు.

మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం, చాలా ఉప ఎన్నికల్లో గెలిచాము, ఎప్పుడు కాంగ్రెస్ ల మేము దాడులు చేయలేదు…కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము..మా కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి అన్నారు.

దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచింది..తాను అహంకారం తగ్గించుకోవాలన్నా రెవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..ఎవరిదీ అహంకారమో ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారు..మేము ఎన్నో ఎన్నికలు గెలిచాము …పార్టీ గుర్తును గాడిదకి ఎక్కించి ఊరేగింపు చేశామా..ఒక్క ఎన్నికలో గెలిస్తేనే ఇంత మీడిసిపడితే.. గతంలో మేము ఎన్ని ఎన్నికలు గెలిచాము అన్నారు.కాంగ్రెస్ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు అన్నారు.

Also Read:పీఎం కిసాన్‌..డేట్ ఫిక్స్!

- Advertisement -