KTR: సచివాలయం ముందు రాజీవ్ విగ్రహామా?

3
- Advertisement -

హైదరాబాద్ సచివాలయం ముందట తెలంగాణ తల్లి స్థానంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదని…అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సచివాలయ పునర్నిర్మానం చేద్దామనుకున్నారు..తెలంగాణ పౌరుషం, తెలంగాణ వైభవాన్ని చాటేలా నూతన సచివాలయం నిర్మించాలనుకొన్నారు అన్నారు.

తెలంగాణ భవిష్యత్తు తరాలకు అందించేలా అద్భుతమైన డిజైన్తో ముందుకు తీసుకువెళ్లారు…బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సచివాలయానికి పెట్టుకున్నము..సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి అమరవీరుల త్యాగాలని స్ఫూర్తిని జవల్లింపజేస్తూ స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన అమర జ్యోతి స్మారకన్నీ నిర్మించాము అన్నారు.

తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతికైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ క్రియేట్ చేయడం జరిగిందని,దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. మా సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు మాతో లేకపోవడం బాధాకరం అన్నారు. అయినా ఆమెకి న్యాయం లభిస్తుందని సుప్రీంకోర్టుపైన నమ్మకం ఉదని, రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కుసంస్కార పార్టీ , అందుకే ఈరోజు తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అనడు … మహనీయుడు అంబేద్కర్ కి కనీసం పూలదండ వేయడు, కనీసం లైటింగ్ ఏర్పాటు చేయడు..అమర జ్యోతి ఇప్పటిదాకా ప్రజల కోసం ప్రారంభం కాలేదు అన్నారు.

ఒకప్పుడు అంజయ్య గారి పేరుతో ఉన్న పార్కు లుంబిని పార్క్ అయింది..అదే అంజయ్య గారి పార్కు ఎదురుంగా ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు అన్నారు. గత పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా పేర్ల మార్పు పైన ఆలోచించలేదు..రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ కి, రాజీవ్ గాంధీ స్టేడియం రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడు మార్చనికి ప్రయత్నం చేయలేదు అన్నారు.

Also Read:‘జానీ మాస్టర్‌’కు ఘన సన్మానం

- Advertisement -