వాననీటిని ఒడిసిపట్టేందుకు..ఈ పార్క్‌ను సందర్శించండి:కేటీఆర్

563
rain water ktr
- Advertisement -

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రెయిన్ వాటర్‌ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సందర్శించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆసక్తిగల నగర ప్రజలు తప్పకుండా ఈ పార్కును సందర్శించడం ద్వారా వర్షపు నీరు వృధా కాకుండా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవచ్చని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

న‌గ‌ర‌వాసుల‌కు ఇంకుడుగుంత‌లు, నీటి పొదుపుపై అవ‌గాహన క‌ల్పించేందుకు రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రూ. 2 కోట్ల‌తో ఈ థీమ్ పార్కు ఏర్పాటు చేశారు.

ఇందులో భ‌వ‌నాల్లో, కాలువ‌ల్లో ఏ విధంగా నీటి పొదుపు చేయ‌వ‌చ్చో తెలియ‌జేసే నిర్మాణాలు ఇందులో ఉంటాయి. 42 న‌మూనాల‌ నీటి సంర‌క్ష‌ణ విధానాలు ఇందులో ఏర్పాటు చేశారు. పిల్ల‌ల‌కు నీటి విలువ‌ల‌ను గురించి తెలియ‌జేసే యానిమేష‌న్ విడియోలు, కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి మంచినీటిని త‌ర‌లిస్తున్న త్రీడి రూపంలో వీడియోలు ఇందులో చూడవచ్చు.

ఈ పార్కులో గొడుగు ఆకారంలోని నాలుగు గ‌జెటోల‌ను నిర్మించారు. వాన‌నీరు వీటిపై ప‌డ‌గానే ఆ నీరు ప్ర‌క్క‌నే ఉన్న సంపులోకి వెళ్లేలా ఏర్పాటుచేశారు.ఇక్క‌డ ఏర్పాటుచేసిన భారీ స్కేలుపై మ‌నిషి నిల‌బ‌డితే ఆ వ్య‌క్తి ఒంట్లో ఎంత నీరు ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు.

- Advertisement -