బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇక చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్,రాహుల్ కన్నుగీటు,కౌగిలింతలు హైలైట్‌గా నిలిచాయి. ఇక ముఖ్యంగా ప్రసంగం మొత్తం మోడీని తూర్పారబట్టిన రాహుల్…చివర్లో మోడీని కౌగిలించుకోవడం తర్వాత కన్నుకొట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. తాను చాలాపెద్ద నాటకాన్ని చూడలేకపోయానని తెలిపారు కేటీఆర్. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చను తాను చూడలేదని …కౌగిలింతలు, కన్ను గీటులు, నేతల వాక్చాతుర్యంతో కూడిన పెద్ద నాటకాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయానే అని అనుకుంటున్నా అని ట్వీట్ చేశారు.
మరోవైపు సోషల్ మీడియాతో సహా అన్నిపత్రికల్లో రాహుల్…మోడీని హత్తుకున్న వార్త బ్యానర్ ఐటమ్‌గా నిలిచింది. అంతేగాదు రాహుల్ కన్నుకొట్టే ఫోటోలు కూడా పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఇక ట్విట్టర్, ఎఫ్బీలో హ్యాష్‌ట్యాగ్‌లు, సెటైర్ కామెంట్లతో నెటిజన్లు చెలరేగిపోయారు. మళయాళం హీరోయిన్ ప్రియా వారియర్ కన్ను కొట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
Looks like I missed watching some major drama live; Hugs, winks, rhetoric etc. 😀
— KTR (@KTRTRS) July 21, 2018