దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి కేటీఆర్. అందరితో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం తాను ఆసక్తిగానే ఎదురుచూస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సర్వే రిపోట్లు టీఆర్‌ఎస్‌కే అనుకూలం అని చెబుతున్నా ఉత్కంఠగా ఉందని ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. 230 కోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని…అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ఓనర్ మార్క్ బెనిఫ్‌కు ట్యాగ్ చేసిన ట్వీట్‌లో వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల కిందటే మొక్కలు నాటడం ప్రారంభమైందని ఇప్పటికే 70 శాతం టార్గెట్‌ను చేరుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హరితహారంకు తోడు టీఆర్ఎస్ ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.
Landed back in good old Hyderabad. Looking forward to tomorrow’s Municipal election results
Reports indicate that @trspartyonline will do well but keeping my fingers crossed 🤞
— KTR (@KTRTRS) January 24, 2020