టీఆర్ఎస్ విజయం..అనితర సాధ్యం: కేటీఆర్

423
ktr
- Advertisement -

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారని చెప్పారు. 127 మున్సిపాలిటీలు,కార్పొరేషన్‌లలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశామని చెప్పారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్నారు. శాస్త్రీయంగా వార్డుల విభజన,మున్సిపాలిటీలు,కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్,బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు పేరుకే ఢిల్లీ పార్టీలు…చేసేవన్ని గల్లీ రాజకీయాలు అన్నారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక కుతంత్రాలు చేశాయన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం అనితర సాధ్యం అన్నారు. త్వరలో పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు.సెల్ప్ సర్టిఫికేషన్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించే విధానాన్ని తీసుకొస్తామన్నారు.

మున్సిపాలిటీల్లో ప్రణాళికబద్దమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టం పారదర్శకంగా తీసుకొచ్చామన్నారు. నగర,పట్టణ పాలనను సంస్ధాగతంగా బలోపేతం చేస్తామన్నారు. పౌరుల భాగస్వామ్యంతో సెల్ఫ్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో కొత్త డోర్ నెంబర్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. మున్సిపాలిటీ  బడ్జెట్ లో పచ్చదనానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అవినీతికి పాల్పడితే వారిపై వేటు వేసేలా కొత్త మున్సిపాలిటీ చట్టం ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ లేనిచోట కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామన్నారు.

- Advertisement -