సమైక్యరాష్ట్రంలో మున్సిపాలిటీలు అంటే మురికికూపాలుగా ఉండేవి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. బల్దియాలు అంటే ఖాయా పియా చల్దియా అనే సామెత ఉండేది..కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వతా కెసిఅర్ గారు పట్టణాల అభివృద్ది కోసం ప్రత్యేక విజన్ తో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు.
అందుకే అర్ధిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, వాటి సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టాం.. పట్టణీకరణ అపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. పట్టాణాల విస్తరణ అపడం వీలు కాదు కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ది చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశాం. చేసిన పనిని అభివృద్ది నివేదికల రూపంలో ప్రజల ముందుంచాం అన్నారు.
10 సంవత్సరాలు పాటు జరిగిన పట్టణాలు అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదు… పక్క ప్రణాళికతో పాటు అవసరమైన సంస్కరణలు నిరంతర పర్యవేక్షణ అవసరమైన నిధులు అందించడం వంటి నిరంతర ఫోకస్తోనే తెలంగాణలోని పట్టణాలు ఈరోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయి అన్నారు. తెలంగాణ పట్టణాలకు పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు దక్కాయి … గత పది సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు పట్టణాల అభివృద్ధి కోసం అద్భుతంగా పనిచేశారు అన్నారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేశారు .. పదవీ కాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి… మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారు.మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.
కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గర అయింది.. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పట్టణాలు అభివృద్ధి కుంటు పడటంతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయింది ..ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి ప్రాజెక్టుల పేరుతో కూలగొడుతున్నారు అన్నారు.
Also Read:పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా