KTR: మెఘాతో బంధం వెనక మతలబేంటి?

8
- Advertisement -

సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… మేఘా ఇంజినీరింగ్ సంస్థపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ఔదార్యం చూపిస్తున్నారని అన్నారు. మేఘా బంధం వెనకున్న మతలబు ఏంటని ప్రశ్నించారు.

సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదానికి కారణమైన ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఆ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌ రెడ్డి అప్పజెప్పనున్నారని చెప్పారు.

Also Read:సీఎం రేవంత్‌ రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ భేటీ

 

- Advertisement -