KTR : కోల్‌కతా డాక్టర్‌ ఘటనపై కేటీఆర్‌

7
- Advertisement -

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరుగగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు నర్సులు. ఈ ఘటనపై స్పందించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కోల్ కతా ఘటన తనను బాధించిందని.. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరినీ వదిలిపెట్టకూడదని ..మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.

డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్‌ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్‌ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది.

Also Read:వారసుల కోసం తండ్రుల పోరు..కాంగ్రెస్‌లో నయా వార్!

- Advertisement -